భారతదేశం, మార్చి 27 -- రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'ధురంధర్ 2' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ తన లేటెస్ట్ వీడియో 'ధురంధర్ 2 ఎక్స్పోజ్డ్' లో ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. గతంలో ఈ చిత్రాన్ని 'బ్రెయిన్‌రాట్' అని పిలిచిన రాథీ, ఇప్పుడు దేశ చరిత్రను, ప్రజల అనుభవాలను ఈ సినిమా తప్పుగా చూపిస్తోందని ఆరోపించాడు.

ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ పై ధ్రువ్ రాథీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. "ఆదిత్య ధర్ వాట్సాప్ ఫార్వర్డ్‌ల ఆధారంగా ఒక సినిమాటిక్ విశ్వాన్ని సృష్టించాడు" అని ధ్రువ్ ఎద్దేవా చేశాడు.

ధురంధర్ 2 సినిమా ప్రారంభంలో 'నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందింది' అని వేసే డిస్‌క్లైమర్‌ పై ధ్రువ్ రాథీ విరుచుకుపడ్డాడు. దీని బదులుగా 'వాట్సాప్ ఫార్వర్డ్‌ల నుంచి ప్రేరణ పొందింది' అని వేస్తే మరింత కరె...