భారతదేశం, మే 18 -- MS Dhoni IPl retirement : ఐపీఎల్​ 2026 లీగ్​ స్టేజ్​ ముగిపు దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్​ కింగ్స్​కి ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి నేడు (మే 18) సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరగనుంది. ఈ సీజన్​లో హోమ్​ గ్రౌండ్​లో ఆ జట్టుకు ఇదే చివరి మ్యాచ్. అందుకే ఇప్పుడు అందరి ఫోకస్​ లెజెండ్ ఎంఎస్​ ధోనీపై పడింది! గాయం కారణంగా ఈ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా ఆడని ధోనీ.. ఈరోజు ఆడేసి, ఆటకి గుడ్​బై చెప్పేస్తాడా? అని అందరు ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం కూడా ధోనీయే!

ప్రస్తుతం చెపాక్‌లో నెలకొన్న వాతావరణం, ఐదేళ్ల క్రితం ధోనీ స్వయంగా చేసిన ఒక ప్రకటనకు సరిగ్గా సరిపోతోంది. 2021లో సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంబరాల్లో ధోనీ మాట్లాడుతూ.. తన కెరీర్ చివరి టీ20 మ్యాచ్‌ చెన్నైలోనే ఆడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

"న...