భారతదేశం, సెప్టెంబర్ 14 -- మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా ముగిసిన 'ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ 2026'లో విజయవాడకు చెందిన ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ రికార్డులకెక్కాడు. ఫైనల్ పోరులో జపాన్ క్రీడాకారుడు నకానిషి జున్యాపై 6-5 తేడాతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన షూట్-ఆఫ్ దఫాలో 10 పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు ధీరజ్.

మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తెలుగు విలుకాడు ధీరజ్ బొమ్మదేవరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. ధీరజ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

'విజయవాడ ఆర్చరీ మైదానాల నుంచి ప్రారంభ...