భారతదేశం, జూన్ 10 -- Dhanush Sai Pallavi: 'అమరన్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డీ55' (D55). ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నేషనల్ ఫేవరెట్ సాయి పల్లవి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి క్యారెక్టర్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకే సినిమాలో నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన సాయి పల్లవి, డాన్స్ అండ్ గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీలీల ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పాత్రపై అంచనాలు పెరిగాయి.

సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉన్నారంటే అక్కడ కమర్షియల్ ఈక్వేషన్స్ చాలా ఆసక్తికరంగా మ...