భారతదేశం, నవంబర్ 15 -- Dhanush About Mammootty 13 Years Ago Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలిసారిగా తెరపై కలసి కనిపించబోతున్నారని చాలామంది భావిస్తున్నారు. కానీ, అందులో నిజం లేదు. దాదాపు పదమూడేళ్ల క్రితమే వీరిద్దరూ ఒకే సినిమాలో నటించారు.

త్వరలో విడుదల కానున్న తమ కొత్త చిత్రం 'ఓం: ఆపరేషన్ మోల్' (OM: Operation Mole) ప్రీ-రిలీజ్ వేడుకలో ధనుష్ ఈ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాడు మమ్ముట్టి ప్రవర్తన చూసి ఆయన చాలా రూడ్‌గా ఉంటారనుకున్నానని ధనుష్ నవ్వుతూ వెల్లడించారు.

'అమరన్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ ఓం చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కీలక పాత్రలు పోషిస్తుండటం, కథ మొత్త...