భారతదేశం, ఏప్రిల్ 21 -- Dhanush Mrunal: ధనుష్ కోసం మృణాల్ ఠాకూర్ దేవతగా మారబోతుందంటా.. ధనుష్ డైరెక్షన్ లో ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఓ సినిమా చేయబోతుందంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పుడీ క్రేజీ బజ్ తెగ వైరల్ గా మారింది. దీంతో మరోసారి ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ రూమర్లు గుప్పుమంటున్నాయి.

తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ మంచి డైరెక్టర్ కూడా. ఇప్పటికే అతను మెగాఫోన్ పట్టి సినిమాలు తీశాడు. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అనే ప్రచారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ధనుష్ లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయబోతున్నాడని టాక్. ఆ వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయబోతుందని సమాచారం. ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తీసుకురాబోతున్నారని తెలిసింది. ఇందులో మృణాల్ ఠాక...