భారతదేశం, నవంబర్ 28 -- కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) బిల్లుపై భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. పార్లమెంటులో ఈ బిల్లుపై జరిగే ఓటింగ్‌లో తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం కలగకూడదన్నదే తమ పార్టీ ప్రధాన డిమాండ్‌ అని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని గతంలో పలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుత బిల్లులోని ప్రతిపాదనలు ఆ ...