భారతదేశం, జూలై 5 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో 'బ్రెయిన్ ఫాగ్' అనేది చాలా మందిలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. తరచుగా తలనొప్పి రావడం, పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, చిన్న విషయాలకే విపరీతమైన కోపం లేదా చిరాకు రావడం, రాత్రిపూట ఎంత బాగా నిద్రపోయినా ఉదయం లేవగానే ఒంట్లో ఓపిక లేనట్లు అనిపించడం.. వీటన్నింటినీ బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా చెబుతారు.

సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించగానే అందరూ ఒత్తిడి, పనిభారం లేదా నిద్రలేమి అనుకుంటారు. కానీ, వీటన్నింటికీ వెనుక మనం తరచుగా నిర్లక్ష్యం చేసే 'మైల్డ్ డీహైడ్రేషన్' (శరీరంలో నీటి శాతం తగ్గడం) ఒక ముఖ్య కారణం కావచ్చని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ జనరల్ సర్జరీ, ట్రామా అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి. రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. శరీరంలో నీటి కొరత మెదడుపై ఎలాంటి...