భారతదేశం, జూన్ 20 -- Deewana Movie Review: దీవానా మూవీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రావడంతోనే రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ నెలకొంది. యంగ్ టాలెంట్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా ఇది. ఈ శనివారం (జూన్ 20న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసేలా రూపొందించిన ఈ క్రేజీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూడండి.

దీవానా మూవీ కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఒక బాధ్యత లేని, అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. ఏ పనీపాటా లేకుండా ఎప్పుడూ తన ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్ల మీద తిరగడం, లోకల్ గొడవల్లో తలదూర్చడం, కాలక్షేపం చేయడమే అతని రోజువార...