భారతదేశం, జూన్ 22 -- Deewana: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా 'దీవానా' (Deewana). ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు, బాక్సాఫీస్ వసూళ్లు వస్తుండటంతో మూవీ టీమ్ సోమవారం (జూన్ 22) ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ విషయంలో మేకర్స్ సంతోషంగా ఉన్నా.. సెన్సార్ నుంచి ఎ సర్టిఫికెట్ రావడంపైనే వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత శ్రీదేవి ఓపెన్ గా సెన్సార్ బోర్డుపై విమర్శలు చేసింది.

ఈ దీవానా మూవీ సక్సెస్ మీట్‌లో చిత్ర నిర్మాత శ్రీదేవి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

"ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్ నుండి బయటకు వచ్చి మమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. కానీ ఒక నిర్మాతగా నేను పూర్తిగా సంతోషంగా లేను. మా 'దీవానా' సినిమాను థియేటర్లలో చూడటానికి సిద్ధమై...