భారతదేశం, అక్టోబర్ 20 -- Deepika Ranveer Daughter: బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ అయిన మోస్ట్ అడోరబుల్ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ అభిమానులకు విజయదశమి వేళ ఒక అద్భుతమైన తీపి కబురును అందించారు. ఇటీవల రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన ఈ జంట.. తమ ముద్దుల కూతురి ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు చిన్నారికి పెట్టిన పేరునూ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 19, 2026న జన్మించిన ఈ ముద్దుల పాపాయికి అక్క దువా పదుకోన్ సింగ్ ముద్దు పెడుతున్న క్యూట్ ఫ్యామిలీ ఫొటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

విజయదశమి పండుగను పురస్కరించుకుని దీపికా పదుకోన్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా "ప్రేమ, సమృద్ధి.. దేవి పదుకోన్ సింగ్ అని రాసుకొచ్చారు.

ఈ ఫొటోలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా కుటుంబమంతా బంగారు, క్రీమ...