భారతదేశం, మే 1 -- Deepika Padukone King: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఓం శాంతి ఓం' నుంచి 'పఠాన్' వరకు వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా 'కింగ్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతోంది.

శుక్రవారం (మే 1) ఉదయం సోషల్ మీడియాలో (ఎక్స్, రెడిట్) ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో దీపికా పదుకోన్ ఫ్లోరల్ ప్రింట్ గౌనులో మెరిసిపోతుండగా, షారుఖ్ ఖాన్ 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. షారుఖ్.. దీపికా చేయి పట్టుకుని నడుస్తున్న ఈ ఫోటోలు చూస్తుంటే ఇది ఒక ఫ్లాష్‌బ్యాక్ సాంగ్ సీక్వెన్స్ అని అర్థమవుతోంది.

ఈ ఫో...