భారతదేశం, ఏప్రిల్ 11 -- Deepika Padukone: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, తాజాగా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ వివరాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాలలో 'రాకా' ఒకటి. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలిసింది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'రాకా' సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆమె మరోసారి పలకరించనుంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. దీని కోస...