భారతదేశం, మార్చి 12 -- బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గురువారం (మార్చి 12) ఉదయం ముంబై మహానగరం దట్టమైన పొగమంచు, కాలుష్యం ముసుగులో నిద్రలేచింది. నగరవ్యాప్తంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీనిపైనే దీపిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
దీపికా పదుకోన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ముంబై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మ్యాప్‌ను షేర్ చేస్తూ.. నగరంలోని భయంకరమైన కాలుష్య స్థాయిలను ఎత్తిచూపింది. "ఈ నగరం (ఇంకా ఇక్కడి పిల్లలు) ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు! ఇది ఎలా ఆమోదయోగ్యం!?" అని ఆమె ప్రశ్నించింది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), ఆరోగ్య శాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ, వెంటనే స్పందించాలని కోరింది. గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.