భారతదేశం, మే 3 -- Dacoit OTT Release Date: థియేటర్లలో యాక్షన్ అండ్ రొమాన్స్‌తో అలరించిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ల 'డెకాయిట్' (Dacoit: A Love Story) ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించిన ఈ మూవీ.. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, గ్లామరస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ'. షనీల్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించినప్పటికీ, అడివి శేష్ మార్కెట్ స్టామినాతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు థియేటర్లలో చూడని ప్రేక్షకుల కో...