భారతదేశం, ఏప్రిల్ 30 -- Dacoit OTT Release Details: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ'. ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. మొదటి రోజే సుమారు 6.55 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో అడివి శేష్ తన మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు.

శని, ఆదివారాల్లో కూడా నిలకడగా రాణించడంతో మొదటి వారం ముగిసేసరికి డెకాయిట్ సినిమా 28.45 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది. రెండో వారంలో 'ధురంధర్ 2', 'భూత్ బంగ్లా' వంటి పెద్ద సినిమాల నుంచి పోటీ ఎదురైనప్పటికీ, నిలకడగా ఆడి ప్రపంచవ్యాప్తంగా 55.23 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో కేవలం ఇండియా నుంచే 41.65 కోట్ల రూపాయలు రావడం విశేషం.

దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ సినిమా పక్...