భారతదేశం, నవంబర్ 1 -- అర్నబ్ తుపాను తీరాన్ని తాకిన వారం రోజులకే.. ఇప్పుడు మురసు(Murasu) తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఇది నవంబర్ 2-3 తేదీల మధ్య రాత్రి వేళలో నెల్లూరు-నర్సాపురం మధ్య ప్రాంతంలో తీవ్ర తుపాను(Severe Cyclonic Storm)గా తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 120 కిలోమీటర్ల వేగం వరకు పెరగవచ్చు. తమిళ భాషలో మురసు అంటే యుద్ధ సమయంలో ఉపయోగించే 'డ్రమ్' అని అర్థం.

'ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం, అదే రోజున బలపడి మురసు తుపానుగా మారింది. బంగాళాఖాతంలో మురసు తుపాను మరింత బలపడుతోంది. ఇది నవంబర్ 2, 2026 ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. నవంబర్ 2 అర్ధరాత్రి నుండి నవంబర్ 3 తెల్లవారుజాములోపు న...