Cyclone Arnab Landfall : తీరం దాటిన 'అర్నబ్' తుఫాన్ - ఉభయ గోదావరి జిల్లాలకు హెచ్చరికలు
భారతదేశం, అక్టోబర్ 28 -- తీవ్ర రూపం దాల్చిన 'అర్నబ్' తుపాను తీరం దాటింది. నరసాపురం సమీపంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతి దిశగా, నరసాపురం పరిసర ప్రాంతాల్లో తుపాను తీరాన్ని దాటినట్లు అధికారులు ధ్రువీకరించారు.
తీరం దాటే సమయంలో గంటకు ఈదురుగాలులతో కూడిన తుపాను విరుచుకుపడింది. అనంతరం ఇది కొంత బలహీనపడి తీవ్ర తుపానుగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
తుఫాన్ తీరం దాటినప్పటికీ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు హెచ్చరించారు. తీరం దాటిన తర్వాత కూడా గాలివేగం, వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.