భారతదేశం, అక్టోబర్ 28 -- అర్నబ్ తుపాన్‌ నేపథ్యంలో కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా పరిస్థితులను, గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్టు ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లు వివరణ ఇచ్చారు. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు అధికారులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులను వెంటనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

కోనసీమ, పశ్చ...