భారతదేశం, అక్టోబర్ 27 -- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన కొద్ది గంటల్లో గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను, తీవ్ర రూపం దాల్చి తీర ప్రాంత జిల్లాలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి ఈ తుపాను కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170, మచిలీపట్నానికి 230, బాపట్లకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో అర్నబ్ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఈదురుగాలుల వేగం గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

తుపాను ...