భారతదేశం, ఏప్రిల్ 26 -- దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ పీజీ 2026) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా దేశంలోని 198 యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. మరి ఫలితాల తర్వాత నెక్ట్స్​ ప్రాసెస్​ ఎంటి? ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఈ ఏడాది మార్చి 6 నుంచి 30 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 5,04,301 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 157 సబ్జెక్టుల కోసం 50 షిఫ్టుల్లో ఎన్టీఏ ఈ పరీక్షలను నిర్వహించింది. ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ ఫలితాలను పొందడానికి exams.nta.nic.in/cuet-p...