భారతదేశం, ఏప్రిల్ 15 -- CSK vs KKR: ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫామ్ లోకి వచ్చింది. అయిదు సార్లు ఛాంపియన్ అయిన ఈ టీమ్ వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. షారుక్ ఖాన్ ఓనర్ గా ఉన్న కేకేఆర్ ఈ సీజన్ లో ఇంకా బోణీ కూడా కొట్టలేదు.

ఐపీఎల్ 2026లో సీఎస్కే వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం (ఏప్రిల్ 14) రాత్రి ముగిసిన మ్యాచ్ లో ఆ టీమ్ 32 పరుగుల తేడాతో కేకేఆర్ ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేజింగ్ లో కేకేఆర్ 7 వికెట్లకు 160 రన్స్ మాత్రమే చేయగలిగింది.

చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్ లో చెలరేగాడు. ఈ అఫ్గానిస్థాన్ యువ సంచలనం, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కోల్‌కతా వెన్...