భారతదేశం, ఏప్రిల్ 12 -- CSK vs DC: హ్యాట్రిక్ ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు ఫస్ట్ విక్టరీ. అయిదు సార్లు ఛాంపియన్ అయిన ఆ టీమ్ ఐపీఎల్ 2026లో బోణీ కొట్టింది. శనివారం (ఏప్రిల్ 11) రాత్రి చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 23 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది.

ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు వచ్చిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో తన సత్తాచాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఆటాడుకున్నాడు. శాంసన్ 56 బంతుల్లోనే 115 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. ఈ ఐపీఎల్ 2016లో ఇదే ఫస్ట్ సెంచరీ.

సంజు శాంసన్ (115 నాటౌట్)తో పాటు ఆయుష్ మాత్రె (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), శివమ్ దూబె (10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 20 నాటౌట్) చెలరేగడంతో చెన్నై బిగ్ స్కోరు చేసింది....