Crime news : భార్యను కాపురానికి రమ్మన్న వ్యక్తికి నిప్పు పెట్టి సజీవ దహనం చేసిన బావమరిది!
భారతదేశం, జూలై 5 -- పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో మానవ జాతి సిగ్గుపడేలా ఒక ఘోర, జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను నచ్చజెప్పి ఇంటికి తీసుకువెళదామని వచ్చిన వ్యక్తిని బావమరిది (భార్య సోదరుడు) అత్యంత క్రూరంగా సజీవ దహనం చేశాడు! ఈ క్రమంలో బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో మహిళ కూడా తీవ్రమైన గాయాలపాలై చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘోరానికి సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘోర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని లవ్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్‌లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసు నివేదికల ప్రకారం.. లవ్‌ప్రీత్ సింగ్‌కు అతని భార్య సందీప్ కౌర్‌కు మధ్య ఇటీవల కొన్ని కుటుంబ గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ కౌర్ కాపురం వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.