భారతదేశం, మార్చి 28 -- అది 2023, ఏప్రిల్ 25వ తేదీ ఉదయం. మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల పోలీస్ అధికారి జయంత్ బల్లవార్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కుమార్తె ఆర్య (ఈమె కూడా పోలీస్ శాఖలోనే పనిచేస్తోంది) ప్రేమగా తండ్రికి మిల్క్‌షేక్ ఇచ్చింది. అది తాగిన తర్వాత, కొద్దిసేపటికి ఆయన జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయి ప్రాణాలు విడిచారు. అప్పట్లో అది అనారోగ్యంతో జరిగిన సహజ మరణంగానే అందరూ భావించారు. కానీ, మూడేళ్ల తర్వాత ఈ కేసులో బయటపడిన నిజాలు పోలీసులనే విస్మయానికి గురిచేస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. ఆర్య బల్లవార్ 2022 నుంచి ఆశిష్ షెడ్మాకే అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే, ఈ సంబంధాన్ని తండ్రి జయంత్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తండ్రిని ఎల...