భారతదేశం, సెప్టెంబర్ 18 -- Comedy Web Series: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపులర్ కామెడీ వెబ్ సిరీస్ 'దుపహియా' (Dupahiya) రెండో సీజన్‌కు సంబంధించి ప్రైమ్ వీడియో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. గజ్‌రాజ్ రావు, రేణుకా షహాణే, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రూరల్ కామెడీ డ్రామా సిరీస్ అక్టోబర్ 1, 2026 నుంచి గ్లోబల్ వైడ్‌గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

రూరల్ కామెడీ వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పంచాయత్, గ్రామ్ చికిత్సాలయ్ లాంటి సిరీస్ లు ఇప్పటికే ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయ్యాయి. ఆ కోవలో వచ్చిందే ఈ దుపహియా అనే వెబ్ సిరీస్. ఓ ఊళ్లో బైకు చోరీ చుట్టూ తిరిగే ఫన్నీ సిరీస్ ఇది.

ఇప్పుడీ రూరల్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్‌ను ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంద...