Comedian: కమెడియన్‌కు ఏకంగా రూ.7.35 కోట్ల జరిమానా.. కట్టకపోతే ఆరు నెలల జైలు.. చెక్కు బౌన్స్ కేసులో కష్టాల్లో రాజ్‌పాల్
భారతదేశం, జూలై 10 -- Comedian: బాలీవుడ్ సీనియర్ కామెడీ స్టార్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఎప్పటినుంచో సాగుతున్న చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏకంగా రూ.7.35 కోట్ల భారీ ఫైన్ విధిస్తూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సంచలన తీర్పు ఇచ్చారు. ఒకవేళ ఈ జరిమానా మొత్తం గనుక సకాలంలో చెల్లించకపోతే ఆయన మళ్లీ ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు రాజ్‌పాల్ యాదవ్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీలను ఆయన పదే పదే బ్రేక్ చేశారని, అందుకే ఎలాంటి ఊరట ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మొత్తం ఏడు కేసుల్లో ఒక్కో దానికి రూ.1.05 కోట్ల చొప్పున మొత్తం రూ.7.35 కోట్లు చెల్లంచాల్సిందేనని ఆర్డర్ వేసింది. ఆయన భార్య రాధా యాదవ్‌కు కూడా ప్రతి కేసులో రూ.5 లక్షల కంటే ఎక్కువ ఫైన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.