భారతదేశం, నవంబర్ 28 -- ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజురోజుకు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో శనివారం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం కనిష్ట ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. లంబసింగిలో 7.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని జనాలు తెల్లవారుజామున తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు దట్టమైన పొగమంచు ఉంటుంది. దీంతో వాహనాల్లో వెళ్తుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఘాట్ రోడ్లపై స్థానికులు వాహనాలు నడపడం కష్టంగా మారింది.

లంబసింగి లాంటి ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 నుండి 7 గంటల మధ్...