భారతదేశం, మే 26 -- CNG price Hyderabad : అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఇంధన ధరల మంట కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నేరుగా భారతీయ వాహనదారుల జేబులపై పడుతోంది. నిన్న పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. ఇక ఈరోజు, మంగళవారం సీఎన్జీ ధర కిలోకు రూ. 2 మేర జంప్​ అయ్యాయి.

పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న డ్రోన్లు, క్షిపణుల యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన అవసరాలలో ఐదో వంతు వాటా సరఫరా చేసే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' జలమార్గం దాదాపు మూతపడింది. భౌగోళికంగా ఈ ప్రాంతంపై ఇరాన్‌కు పట్టు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా అంటుకున్నాయి. దీని ప్రభావంతో గడిచిన 15 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి.

ధరల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజా రేట్లు ఇక్కడ చూద్...