భారతదేశం, మార్చి 25 -- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు.

ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50 శాతం సీట్లు పెంచుతూ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే.. రేపటి రోజున జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని విశ్లేషించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా పోతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో 'భారతదేశం - ప్రపంచం' అన్న ఇతివృత్తంపై "వాట్ ఇండియా థింక్స్ టుడే" సమ్మిట్ 2026 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్వి...