భారతదేశం, ఫిబ్రవరి 27 -- రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవన్నారు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామని తెలిపారు.

శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలు, హౌసింగ్ బడ్జెట్ పద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. గత పాలకులు హౌసింగ్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

"అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయి...