భారతదేశం, ఆగస్టు 15 -- స్వాతంత్య్ర దినోత్సవం వేళ సోషల్​ మీడియా వేదికగా హైడ్రామ్ నడుస్తోంది! జంతర్ మంతర్ నిరసనలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ని మెటా బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ఎక్స్​తో పాటు తన సొంత ఇన్​స్టాగ్రామ్ హ్యండిల్ వేదికగా తెలిపారు. ఈ వార్త వెంటనే వైరల్ అయ్యింది. కాగా దీప్కే పోస్ట్​ చేసిన కొన్ని గంటల అనంతరం సీజేపీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యింది.

దాదాపు 2.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఈ సీజేపీ అకౌంట్​లో శనివారం ఉదయం అకస్మాత్తుగా 'యూజర్ నాట్ ఫౌండ్' అని రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. దీప్కే ఈ విషయంపై పోస్టు చేశారు.

"కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్​స్టాగ్రామ్ హ్యాండిల్​ని తొలగించారు. బ్లడీ కవర్డ్స్," అని దీప్కే రాసుకొచ్చారు.

ఇ...