భారతదేశం, జూన్ 4 -- బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ సిద్ధమైంది. భారతదేశంలో తన ఎంట్రీ లెవెల్ ఈవీ అయిన 'ఈసీ3'కి సరికొత్త మిడ్‌లైఫ్ అప్డేట్ ఇస్తూ తాజాగా ఒక టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ తన కొత్త నేమింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ అప్‌గ్రేడెడ్ మోడల్‌కు 'ఎక్స్' సఫిక్స్‌ను జోడించింది. దీనివల్ల ఈ కారు 'సిట్రోయెన్ ఈసీ3 ఎక్స్' పేరుతో మార్కెట్​లోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు.

ఫ్రంట్ ప్రొఫైల్: కారు ముందు భాగంలో సరికొత్త బంపర్‌ను ఇచ్చారు. దీనికి జత చేసిన సిల్వర్ స్కిడ్ ప్లేట్ కారుకు మరింత రగ్గడ్ (రఫ్ అండ్...