భారతదేశం, నవంబర్ 10 -- CII Partnership Summit Visakhapatnam 2026 : నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్‌తో విశాఖ వేదికగా ఈ నెల 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుంది. మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలకు నూతన దశాదిశ అందించేలా ఈ పెట్టుబడుల సదస్సు విశాఖలో ఆవిష్కృతం కానుంది.

కేవలం పెట్టుబడుల ఆకర్షణకు మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ వివిధ అంశాలపై మేథోమథనం నిర్వహించి ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్లేలా ఈ భాగస్వామ్య సదస్సులో చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం అమిత్ షా సహా కేంద్రమంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్...