భారతదేశం, జూలై 4 -- Christopher Nolan Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన లైనప్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఒడిస్సీ' (Odyssey) జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ నెట్టింట తీవ్రమైన బ్యాక్‌లాష్ ఎదుర్కుంటోంది.

ఒడిస్సీ ట్రైలర్ కు వస్తున్న నెగెటివ్ రెస్పాన్స్ తో క్రిస్టోఫర్ నోలన్ కు దారుణమైన అవమానం కలిగింది. ఈ లెజండరీ డైరెక్టర్ కెరీర్ లోనే ఇది అత్యధిక డిస్‌లైకులు పొందిన ట్రైలర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. జూలై 1న రిలీజైన ఒడిస్సీ ఫైనల్ ట్రైలర్ కు ఇప్పటివరకూ 53 వేలకు పైగా లైైక్స్ రాగా.. డిస్‌లైక్స్ మాత్రం ఏకంగా 3 లక్షలకు పైగా ఉన్నాయి. డిస్‌లైకుల శాతం ఏకంగా 85 శాతం ఉండటం గమనా...