భారతదేశం, జూలై 25 -- Christopher Nolan: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తన లేటెస్ట్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. టైమ్ ట్రావెల్, స్పేస్, సైన్స్ ఫిక్షన్, ఎపిక్ మైథాలజీ కథలను మైండ్ బ్లాకింగ్ విజువల్ గ్రాండ్‌నెస్‌తో తెరకెక్కించే నోలన్.. తనను తీవ్రంగా భయపెట్టే ఒకే ఒక్క సినీ జానర్ గురించి ఓపెన్ అయ్యారు. 'ది టునైట్ స్టారింగ్ జిమ్మీ ఫాలన్' టాక్ షోలో పాల్గొన్న ఆయన.. రొమాంటిక్ కామెడీ సినిమా తీయాలంటే తనకు చాలా భయం అని అంగీకరించారు.

జిమ్మీ ఫాలన్ టాక్ షోలో సరదాగా రొమాంటిక్ కామెడీ సినిమాల గురించి చర్చ వచ్చినప్పుడు నోలన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. "నాకు పర్సనల్‌గా రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటం చాలా ఇష్టం. కానీ అలాంటి సినిమా డైరెక్ట్ చేయడం ప్రపంచంలోనే అత్...