భారతదేశం, సెప్టెంబర్ 29 -- Chiranjeevi Remuneration: మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసిన ఒక భారీ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనతో చర్చలు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఒక్క షో కోసం మెగాస్టార్‌కి అక్షరాలా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో గట్టి సంచలనం సృష్టిస్తోంది.

ఇంతవరకు ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఏ సెలబ్రిటీకి ఇవ్వని రీతిలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి.

నందమూరి బాలకృష్ణ ఆహాలో చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ షోకి కాన్సెప్ట్ రైటర్‌గా పనిచేసిన బీవీఎస్ రవి.. ఇప్పుడు చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షోకి కూడ...