భారతదేశం, నవంబర్ 24 -- Chiranjeevi Netflix: వెండితెరపై సుమారు ఐదు దశాబ్దాలుగా తన నటన, డ్యాన్సులు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమయ్యారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన మొట్టమొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'చిరంజీవిస్ మెగావర్స్'పై నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ మంగళవారం (నవంబర్ 24) క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

చిరంజీవి ఇంగ్లిష్ అక్షరాల్లో మిస్ అయిన ఎన్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తేలిపోయింది. నవంబర్ 30న హైదరాబాద్‌లో ఈ షో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుండగా, ఇందులో కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, రవితేజ, నాని, బ్రహ్మానందం వంటి దిగ్గజ సెలబ్రిటీలు అతిథులుగా సందడి చేయనున్నారు.

గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ...