భారతదేశం, సెప్టెంబర్ 20 -- Chiranjeevi Leaks: మూవీ ఈవెంట్లలో తన సినిమాల గురించి లీక్స్ ఇవ్వడం చిరంజీవికి అలవాటే. ఆయన తాజాగా తన అప్ కమింగ్ మూవీ 'కాకా' గురించి ఓ అదిరిపోయే లీక్ ఇచ్చారు. 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'కాకా'.

ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో కాకా చిత్రాన్ని నిర్మిస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా కాకా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్లో కాకా సినిమాలోనే తన క్యారెక్టర్ పేరును చిరంజీవి చెప్పేశారు.

తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్‌లో స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపుతో చిరంజీవి సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా తన 'కాకా' చిత్రంలోన...