భారతదేశం, నవంబర్ 29 -- Chiranjeevi Kaaka: కాకా సినిమా సంక్రాంతికి రావడం కష్టమే.. ఈ చిత్రం కచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో.. ఇవి చిరంజీవి హీరోగా నటిస్తున్న 'కాకా' రిలీజ్ పై తాజాగా వినిపిస్తున్న వార్తలు. కానీ ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని, కాకా మూవీ చెప్పిన రోజుకే వస్తుందని మెగాస్టార్ కన్ఫామ్ చేశారు.

కాకా మూవీ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇస్తూ చిరంజీవి ఇవాళ (నవంబర్ 29) చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ద్వారా మెగాస్టార్ చెప్పిన మ్యాటర్ అలాంటిది మరి. చిరు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఈ ట్వీట్ ఉంది.

చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్లలో ఆటో జానీ ఒకటి. మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ 'రౌడీ అల్లుడు'లో చిరు ఆటో జానీగా బిగ్ స్క్రీన్ పై అదరగొట్టారు. ఆ క్యారెక్టర్ కు ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఇప్పుడు అలాంట...