భారతదేశం, సెప్టెంబర్ 2 -- Chiranjeevi: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు" అని అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమానురాగాలను చిరంజీవి అత్యంత ఆత్మీయంగా వ్యక్తపరిచారు.

పవన్ కళ్యాణ్ కు జనం పట్ల ఉన్న అంకితభావం, చిన్నప్పటి నుంచి ఆయనలో ఉన్న క్రమశిక్షణను చిరంజీవి తన పోస్ట్‌లో గుర్తు చేసుకున్నారు. కుటుంబం మీద ఎంత ప్రేముందో, తన్ను నమ్మిన ప్రజలపైనా అంతే వాత్సల్యం పవన్‌కు ఉందంటూ కొనియాడారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ పడుతున్న కష్టాన్ని మనస్పూర్తిగా అభినందించారు. పాలనలో పవన్ తనదైన ప్రత్యేక ముద్ర వేస్తు...