భారతదేశం, మే 24 -- Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరు, త్వరలోనే ఒక ప్రత్యేకమైన 'పోడ్‌కాస్ట్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షో ద్వారా తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన ఎన్నో అరుదైన విషయాలను ఆయన అభిమానులతో పంచుకోనున్నారు.

​ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా లీక్ చేశారు. చిరంజీవి స్టార్ట్ చేయబోయే ఈ పోడ్‌కాస్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్...