భారతదేశం, మార్చి 10 -- మెగాస్టార్ చిరంజీవి కూతురు, ప్రముఖ నిర్మాత సుష్మిత కొణిదెల తన తండ్రి పట్ల ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. చిన్నప్పుడు తండ్రి చేయి పట్టుకుని షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టిన ఆ రెండేళ్ల చిన్నారి నుంచి, నేడు తండ్రి నటించే సినిమాలకు నిర్మాతగా ఎదిగిన తన ప్రయాణం ఒక అద్భుతమైన వరం అని ఆమె పేర్కొంది.

తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి చిరంజీవి అందించిన శుభాకాంక్షలకు స్పందిస్తూ సుష్మిత ఈ ఎమోషనల్ నోట్ రాసింది. "థాంక్యూ డాడీ.. ఆశ్చర్యంగా చూసే రెండేళ్ల వయసులో మీ చేయి పట్టుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టాను. ఇప్పుడు మీ సినిమాకే నిర్మాతగా మారాను. నా జీవితం నిజంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం" అని సుష్మిత తన మనసులోని మాటను పంచుకుంది.

"నాకు ఒకే వ్యక్తిలో తండ్రి, మార్గదర్శి, రియల్ లైఫ్ హీరో, మెగాస...