భారతదేశం, సెప్టెంబర్ 26 -- Chiranjeevi: సోషల్ మీడియాలో తనపై వస్తున్న 'బాస్ తొక్కేసాడు' మీమ్స్‌పై మెగాస్టార్ చిరంజీవి ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు. సందీప్ కిషన్ నటించిన 'సిగ్మా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి "నన్ను ఏమైనా తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నా" అని సరదాగా కామెంట్ చేసి ట్రోలర్స్‌కి గట్టి షాక్ ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా నెట్టింట చిరంజీవి యంగ్ హీరోల అవకాశాలు తొక్కేస్తున్నారంటూ నెగెటివ్ బ్యాచ్ మీమ్స్ ప్రచారం చేస్తోంది. ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లను ప్రోత్సహించిన ట్రాక్ రికార్డ్ చిరుకి ఉన్నప్పటికీ, ఈ రకమైన ప్రచారాన్ని కొందరు కావాలనే వైరల్ చేస్తున్నారు.

అయితే నిన్న అంటే శుక్రవారం (సెప్టెంబర్ 25) హైదరాబాద్‌లో జరిగిన 'సిగ్మా' ఈవెంట్‌లో చిరు వేసిన సెటైరికల్ జోక్‌తో తనపై వచ్చే ట్రోల్స్ అన్న...