భారతదేశం, మే 10 -- Chiranjeevi: సందర్భంగా ఏదైనా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా రియాక్టవుతుంటారు. ఇవాళ మదర్స్ డే సందర్భంగానూ చిరు ఓ ట్వీట్ చేశారు. తన తల్లితో, తోబుట్టువులతో, సోదరులతో ఉన్న అరుదైన చిత్రాలను కూడా పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ చిరంజీవి పెట్టిన పోస్టు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అమ్మ గొప్పతనాన్ని చాటేలా మెగాస్టార్ పోస్టు ఉంది. తన బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబుతో పాలు తల్లిదండ్రులు, సిస్టర్స్ తో ఉన్న రేర్ ఫొటోలనూ చిరంజీవి పంచుకున్నారు.

''అమ్మ. మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం. కనిపించే దైవం కూడా "కని పెంచిన" మాతృమూర్తి తర్వాతే.! మన విజయాల వెనక త్యాగం. మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి ...