భారతదేశం, జూలై 2 -- Singer Chinmayi Sripada Counter To Misandrist Trolling: సమాజంలో మహిళలపై, చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల గురించి నిరంతరం గొంతు విప్పే సెలబ్రిటీలలో గాయనీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ముందుంటారు. బాధితులకు అండగా నిలబడుతూ, నిందితులను నిలదీస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడూ సంచలనంగా మారుతుంటాయి.

అయితే, సమాజంలోని లూప్‌హోల్స్‌ను ప్రశ్నించే చిన్మయిపై నెటిజన్లలో ఒక వర్గం తరచూ నెగిటివిటీని వెళ్లగక్కుతూనే ఉంటుంది. తాజాగా తనను 'మగ ద్వేషి' (Misandrist) అని విమర్శించిన ఒక నెటిజన్‌కు సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో చురకలు అంటించారు.

ఒక ఎక్స్ వినియోగదారుడు చిన్మయిని ఉద్దేశిస్తూ.. "మగాళ్లను ద్వేషించే చిన్మయి.. ఈ మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు, మీ జీవితాలు మీరు బ్రతకండి అని చెబుతుంది. అదే ఒక మామూలు పరిణతి చె...