భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చాాలా చోట్ల చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని.. చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలంటూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా చికెన్ షాపులు మూసివేశారు. పౌల్ట్రీ కంపెనీలు.. 26 రూపాయలు ఉన్న మార్జిన్‌ను 10 రూపాయలు తగ్గించాయని చికెన్ షాపుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు గుత్తాధిపత్యంతో ఇష్టారాజ్యంగా చికెన్ రేట్లు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తగ్గించిన మార్జిన్‌ను పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నిరవధిక బంద్‌ చేయాలని పిలుపునిచ్చాయి. తమ బాధను అర్థం చేసుకుని.. చికెన్ ప్రియులు సహకరిం...