భారతదేశం, నవంబర్ 15 -- తెలంగాణలోని ఆర్థిక భరోసా కల్పించే చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మంది అర్హులకు పింఛన్లను మంజూరు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న కొత్త లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా మొదటి నెల పింఛన్ సొమ్మును జమ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) రెడీ అయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తున్నారు. ఈ పంపిణీ ప్రక్రియను నవంబర్ 18 నాటికి ప...