భారతదేశం, ఆగస్టు 9 -- Telangana Cheyutha Pension Scheme Applications : తెలంగాణ ప్రభుత్వం నూతన సామాజిక భద్రతా పింఛన్ల (చేయూత) దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులైన పేదలకు పింఛన్లు అందించేందుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది.ఇందులో భాగంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం నుంచే మొదలైన సంగతి తెలిసిందే. చేయూత వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకొన్న అనంతరం వాటిని నింపి, అవసరమైన ధ్రువపత్రాలతో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్‌ కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది.

కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పోర్టల్ ( ( https://cheyutha.telangana.gov.in ) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నింపిన అప్లికేషన్‌ను మీసేవా కేంద్రాలు, ఎంపీడీవో కార్యాలయాలు, మండల సమాఖ్యలు, మున్సిపల్ ఆఫీసులు లేదా వార్డ...