భారతదేశం, ఏప్రిల్ 19 -- Chewing gum side effects: చూయింగ్​ గమ్​ నమలడం చాలా మందికి అలవాటు. మరీ ముఖ్యంగా క్రికెటర్లు స్ట్రెస్​ తగ్గించుకునేందుకు చూయింగ్​ గమ్​ని ఎక్కువ వాడుతుంటారు. అయితే, చూయింగ్​ గమ్​ని ప్రమాదవశాత్తు మింగేస్తే, అది కడుపులోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది? అన్న ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? చూయింగ్​ గమ్​ని మింగేస్తే "ఇక అది నీ కడుపులోనే ఉండిపోతుంది, ఏడేళ్ల వరకు బయటకు రాదు," అని చాలా మంది అంటూ ఉంటారు. ఇందులో నిజం ఎంత? ఇక్కడ తెలుసుకోండి..

చూయింగ్​ గమన్​పై అపోహలను తొలగించడానికి పూణెలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ విశాల్ సేథ్ అసలు నిజాలను వెల్లడించారు. చూయింగ్ గమ్ మింగితే అది కడుపులో ఏళ్ల తరబడి ఉంటుందనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ విశాల్ స్పష్టం చేశారు.

"మనం తినే సాధారణ ఆహ...